ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా ఈ నెల 19 నుండి డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మహిళలకు ముఖ్యమైన పథకాలపై ప్రచారానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన "ప్రజా పాలన కళా యాత్ర" ప్రచార రథాన్ని మంగళవారం ఆమె కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.