నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అల్వాలపాడ్ గ్రామస్తులు సోమవారం ఆందోళన నిర్వహించారు. తమ గ్రామానికి చెందిన 15 గుంటల క్రీడా మైదానం భూమి అన్యాక్రాంత అయిందని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.