26న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

77பார்த்தது
26న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపాన గల సీబీఎం కళాశాల మైదానంలో ఈ నెల 26న ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎం. విజేందర్ యాదవ్, డాక్టర్ సోలపోగుల స్వాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 19, 20 తేదీలల్లో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ సింథటిక్ అథ్లెటిక్స్ ప్రధాన స్టేడియంలో జరగబోయే 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ సౌత్ జోన్ 20 ఏళ్ల లోపు జూనియర్ పురుషులు, జూనియర్ మహిళ లు, అండర్-18 బాలురు, బాలికలు, అండర్- 14, 16, బాలబాలికలు అథ్లెటి క్స్ ఛాంపియన్ షిప్స్- 2024 కొరకు ఈ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி