చిన్న శంకరంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిర్జాపల్లిలో లోకమంథన్ పోస్టర్ ను తపస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్ మహిళా ఉపాధ్యక్షురాలు యెన్నం మాధవి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం లోకమంథనని, ఇది నవంబర్ 21 నుంచి 24 వరకు శిల్పారామంలో జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మంగరాణి, మంగ, శ్రీనివాసులు, రాజేష్, సమినా, తదితరులు పాల్గొన్నారు.