లక్షేటిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్ సోమవారం కవ్వాల్ అడవుల్లో పర్యటించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ బోర్డు వద్ద అటవీశాఖ రేంజి అధికారిణి సుష్మారావు, బీట్ అధికారి శ్రీనివాస్ తో కలిసి సఫారీ వాహనంలో బేస్ క్యాంప్, బైసన్ కుంట, పైడిపల్లి, అల్లి నగర్, మహమ్మదాబాద్, మల్యాల వాచ్ టవర్ వరకు వెళ్లారు. కవ్వాల్ అందాలను చూసి న్యాయమూర్తి మురిసిపోయారు.