మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎఐటియుసి 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకలదాసు జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక శ్రేయస్సు, స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటాలు సాగించిన చరిత్ర కలిగిన ఎఐటియుసి కార్మిక ఉద్యమాలకు దిక్సూచి అన్నారు.