క్యాతనపల్లి రిటైర్డ్ ఎంప్లాయిస్ కాలనీ సమీపంలోని 33/11 కెవి సబ్ స్టేషన్ లో బుధవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ డి ఈఈ కైసర్, ఏడిఈ మోహన్ రెడ్డి తెలిపారు. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 00 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.