తాండూరు మండలంలో సామూహిక అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో సోమవారం అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పాల్గొన్నారు.