మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. శివసేన నేత ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో ముఖ్యమంత్రి పదవి బీజేపీకే దక్కడం ఖాయమని అనిపిస్తోంది. అయితే రేపు ఢిల్లీలో జరగబోయే మహాయుతి నేతల కీలక సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక, ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను మహారాష్ట్రలో వర్కవుట్ చేయనున్నారని సమాచారం. ఇందులో బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పదవి, శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి.