వనపర్తి జిల్లాలో 8312 మంది విద్యార్థులు గ్రూప్-3 పరీక్షలు సజావుగా రాసేందుకు 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు శనివారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత అధికారుల సమక్షంలో ప్రశ్నాపత్రాలు సీసీ కెమెరాల ముందే ఓపెన్ చేయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.