నియోజకవర్గంలోని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట మండలం శేర్ణపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. త్వరలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.