భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం అచ్చంపేటలోని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పోస్టర్ తయారీ, చిత్రలేఖనం, క్రాఫ్ట్ పోటీలు, వీధి నాటికలు, ప్రభాతభేరి తదితర కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు హెచ్ ఎంలు శ్రద్ధ తీసుకోవాలని డీఈవో గోవిందరాజులు సూచించారు.