సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా స్టిక్కరింగ్ ప్రక్రియను జాగ్రత్తగా శుక్రవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. ఈ మేరకు గురువారం జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం ఇప్పటూరు, కారూర్ గ్రామాలలో స్టిక్కరింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికివెళ్లి ఇంటి నెంబరు, యజమాని తదితర వివరాలను అడిగితెలుసుకోని స్టిక్కర్ అతికించాలన్నారు.