టేకులపల్లి: ఎక్సెజ్ కార్యాలయ ముట్టడినీ జయప్రదం చేయండి
ఈ నెల 8న ఇల్లందులో నిర్వహించే ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన సేవాలాల్ సేన మండల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైన్ షాప్ నిర్వాహకులు మధ్యాన్ని ఎమ్ఆర్పి ధరల కంటే అధికంగా విక్రయిస్తున్న ఇటువంటి చర్యలను తీసుకోవడం లేదని అన్నారు. అలాగే బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.