నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రి తుమ్మల సోమవారం ప్రారంభించారు. నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, తదితరులు పాల్గొన్నారు.