మినీ అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు పల్లపు వెంకట్ అన్నారు. మంగళవారం భద్రాచలం ఎటపాక గ్రామంలో మిని అంగన్వాడి వర్కర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడి వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని అన్నారు. చాలీచాలని జీతంతో పనిచేస్తున్న మినీ అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరారు.