నవంబర్ 4 నుంచి ప్రారంభం అయ్యే సోషియో ఎకనామిక్ సర్వేకి సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఎన్యుమరేటర్లుగా నియమితులు అయ్యే కార్యదర్శులకు సూచించారు. సోమవారం అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో సోషియో ఎకనామిక్ సర్వే సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. 150 గృహాలు ఒక బ్లాక్ గా నిర్ణయించి ఒక్కో ఎన్యుమరేటర్లు ఒక్క రోజు పది గృహాలు చొప్పున 15 రోజులు సర్వే చేయాల్సి ఉందన్నారు.