కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాస ఆవరణలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుల జయంతి కార్యక్రమాలకు తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని ఆకాంక్షించారు.