రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ నేత మట్ట దయానంద్ అన్నారు. సోమవారం వేంసూరు మండలం లచ్చన్నగూడెంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.