
మధిరలో ముమ్మరంగా టియుడబ్ల్యూజె సభ్యత్వం నమోదు
మధిర నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం టియుడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికలు చానళ్ళకు చెందిన సీనియర్ జర్నలిస్టుల హాజరై ప్రసంగించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.