ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధిర మండల హ్యూమన్ రైట్స్ నిర్వాహకులు కోటా వెంకట ఆధ్వర్యంలో విద్యార్థులకు స్త్రీ హింస వ్యతిరేకత పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టంలో స్త్రీలకు గల హక్కులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.