ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

70பார்த்தது
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామ సమీపంలోని వాగు నుండి కొందరు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అశ్వారావుపేట తరలిస్తున్నారు. పట్టణ శివారులో ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేశారు. ట్రాక్టర్లను సీజ్ చేసి యాజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.