పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిశారు. తెలంగాణ భక్తులకు తిరుపతి దేవస్థానంలో మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తిరుమలకి తెలంగాణ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, దర్శనం కోసం ప్రత్యేక కేటాయింపులు, సదుపాయాలు అవసరమన్నారు. భక్తులకు వెయ్యి నెంబర్ల కోటాను పెంచడం, ప్రత్యేక దర్శనం టోకెన్లు అందుబాటులోకి తేవాలని కోరారు.