జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.