కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దుపై సమావేశం నిర్వహించారు. టీ పెన్షనర్స్ జిల్లా శాఖ కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు, సహాయ అధ్యక్షుడు పిసి. హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.