కరీంనగర్: గ్రూప్-3 జవాబు పత్రాలు బందోబస్తుతో హైదరాబాద్కు తరలింపు
కరీంనగర్ జిల్లాలో 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్-3 పరీక్ష పూర్తయిన తర్వాత వివిధ పరీక్ష కేంద్రాల నుంచి ఆదివారం, సోమవారం వచ్చిన మూడు సెషన్లకు సంబంధించిన మొత్తం జవాబు పత్రాలకు సీల్ వేసిన అధికారులు వాటిని భారీ బందోబస్తు నడుమ హైదరాబాద్కు సోమవారం తరలించారు. అదనపు కలెక్టర్ ప్రపుల్, దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ విజయ్ కుమార్ తదితరులున్నారు.