ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా అనుమతి లేకుండా టపకాయలదుకాణం పెడితే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ. బొజ్జ మహేష్ హెచ్చరించారు. శనివారం ఎస్ఐ. మీడియాతోమాట్లాడుతూ. టపాసుల షాపులను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, అట్టి షాపులను జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి అనుమతి పొందిన దుకాణం దారుడు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.