బాన్సువాడ మండలంలోని బుడిమి చౌరస్తాలో బుధవారం ఎస్సై మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనకి చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారుల ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువపత్రాలు లేనివారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై మోహన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు శంకర్, కిరణ్, సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.