జాతీయ బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా కర్రే గడ్డం భాస్కర్ గౌడ్ ను, నస్రుల్లాబాద్ మండల ప్రధాన కార్యదర్శిగా కాలగడ్డ సాయిని నియమించినట్లు తెలిపారు. బీసీల సామాజిక ఎదుగుదలకు యువకుల పాత్ర ముఖ్యమైనదని, ప్రతి యువకుడు సమాజంలో 56 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని సూచించారు.