ప్రజలు స్వచ్ఛత పై దృష్టి పెట్టి జగిత్యాల మున్సిపాలిటీని పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దటానికి సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 21 వ వార్డులో శానిటేషన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.