తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. శనివారం కాప్రా డివిజన్ మెహెర్ బాబా కాలనీలో స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు శివమణితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. వాటర్ వర్క్ వాళ్ళతో మాట్లాడి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.