ప్రిన్సిపల్ మందలించడంతో ఓ విద్యార్థిని కాలేజీ నుంచి వెళ్లిపోయింది. మౌలాలిలో ఉంటున్న ఓ విద్యార్థిని తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సోమవారం తరగతి గదిలో ఆమె కనిపించకపోవడంతో ప్రిన్సిపల్ మందలించారు. దీంతో ఎవరికీ చెప్పకుండా కాలేజీ నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా కాచిగూడలో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.