నార్త్ జోన్ పరిధిలో గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలల్లో జరిగాయి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు పర్యవేక్షణలో సిబ్బంది ఓ వైపు ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు మరోవైపు పరీక్షా కేంద్రంలో బందోబస్తు నిర్వహించారు.