దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎలక్ట్రీషియన్ సిబ్బందికి కౌన్సిలర్ తుడుం గణేష్ బుధవారం కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ ప్రజలందరూ ఈ దీపావళిని ప్రశాంతంగా జరుపుకోవాలని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య, సురక్షితంగా, పర్యావరణహితంగా దీపావళి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.