రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కరెంటు చార్జీలు పెంచాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ విఫలం చేసినందుకు సంబరాలు నిర్వహించాలని అన్ని జిల్లాల కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు, కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.