హైదరాబాద్లోని తన ఫామ్ హౌజ్ బఫర్జోన్లో ఉంటే అధికారులు మార్క్ చేయాలని, తన సొంత ఖర్చులతో కూల్చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. “నాకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దు. మీరూ, నేనూ కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుపోనిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దు” అని పేర్కొన్నారు.