కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అధికారులతో నగరంలోని ప్రాంతీయ మేనేజరు కార్యాలయంలో గురువారం బస్సుల ఏర్పాట్లపై ఆర్ఎం సరిరాం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని పంచరామాలు, అరుణాచలం, శబరిమల, అన్నవరం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఈ సమావేశంలో చర్చించారు. 30 నుంచి 40మంది భక్తులు ఉంటే అగిడిన తేదీల్లో బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.