కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం ఎస్ఆర్టీ పంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఒత్తం 102 మంది లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ కుమార్ గౌడ్, అమృత, పద్మ వెంకట్ రెడ్డి, పాల్గొన్నారు.