ఉత్తరప్రదేశ్‌లో ఘోర సంఘటన జరిగింది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వివాహిత ప్రియురాలిని ఓ వ్యక్తి గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కరౌడీ కాలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గజేంద్రపూర్‌కి చెందిన వివాహిత హౌసీలాదేవికి అదే గ్రామానికి చెందిన బిందె అనే వ్యక్తి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కొన్ని రోజులుగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆగ్రహించిన బిందె ఆదివారం రాత్రి గొడ్డలితో ఆమె ఇంటికి వెళ్లి దారుణంగా నరికి చంపాడు.