తెలంగాణ కుటుంబ గుర్తింపు కార్డుల వివరాలు పకడ్బందీగా సేకరించాలని గురువారం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్ సిబ్బందిని ఆదేశించారు. గుర్తింపు కార్డుల వివరాలు సేకరణకు పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన వనపర్తి జిల్లా అంజనగిరి, వనపర్తి మున్సిపాలిటీ 10వ వార్డులో కలెక్టర్ ఆదర్శ సురభి, లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పర్యటించారు. సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.