పత్తి కొనుగోలును నిలిపివేయడంతో సిసిఐ కేంద్రం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. గురువారం తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా అక్కడ అధికారులు నామమాత్రంగా పరీక్షలు జరిపి తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. దళారులు, అధికారులు కుమ్మక్కై రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సై నరేష్ కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.