ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల రోజుల్లోనే లీడర్ అయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి 2006లో జెడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ పార్టీ విభాగానికి అధ్యక్షుడయ్యారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి టీపీసీసీ అధ్యక్షపదవి దక్కించుకున్నారు. శపథం చేసి మరీ కేసీఆర్ ను గద్దె దించి తాను సీఎం అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.