ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి ఆవరణలో "ప్రజా పాలన కళాయాత్ర" ను మంగళవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కళాకారులు నవంబర్ 19 నుండి డిసెంబర్ 7 వరకు రోజూ 3 గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ప్రచారం చేయనున్నారని అన్నారు.