మల్దకల్ మండలంలోని అడవి రావుల చెరువు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన తాగునీటి ట్యాంకులో గత కొంతకాలంగా చనిపోయిన బల్లులు, కప్పలు, బొద్దింకలు, కీటకాలు చనిపోయి ఉన్నాయి. ఈ తాగునీటిని విద్యార్థులు నిత్యం తాగుతున్నా పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.