భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని, భారతదేశం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు గోపాలకృష్ణ, జిల్లా ఓబీసీ మోషే ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ప్రదీప్, భగత్ రెడ్డి పాల్గొన్నారు.