గట్టు మండలంలో BC - B జాబితాలో ఉన్న కురుబలను ప్రభుత్వం చేపట్టే కులగణన సర్వేలో ఎస్సీలమని తప్పుడు సమాచారం ఇచ్చే వారి మీద చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, మాచర్ల ప్రకాష్, ఆర్ఎస్పీ టీం జిల్లా అధ్యక్షుడు బండారి సునందు అధికారులకు కోరారు. ఇట్టి విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాలని గురువారం మండల ఎంపీడీవో చెన్నయ్య గారికి వినతి పత్రం అందచేశారు.