AP: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెంలో 200 ఏళ్లుగా దీపావళి పండగను జరుపుకోరు. దీనికి కారణం కూడా ఉంది. అప్పట్లో దీపావళి, నాగులచవితి రోజున ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. అదే రోజు మరో రెండు ఎద్దులు కూడా మరణించాయి. ఆ రోజు నుంచి గ్రామంలో నాగుల చవితి, దీపావళి పండుగలు జరుపుకోకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారని చెబుతున్నారు. ఆ కట్టుబాటును అందరూ ఇప్పటికీ పాటిస్తున్నారు.