మధ్యాహ్న భోజన పథకం కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు అన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు.