జాతీయ భాష హిందీ దినోత్సవ పక్షోత్సవాలు భాగంగా ఈనెల 20న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే హిందీ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషాను హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కుమార్ కోరారు. బుధవారం కలెక్టర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హిందీ భాష సేవా సమితి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.