పులివెందుల: సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్
పులివెందుల పట్టణం బాకరాపురంలోని తన నివాసంలో బుధవారం కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.